Sunday, March 14, 2010

అందమైన పూల తీగ కొమ్మనల్లుకున్నట్టు
చందనాల సుగంధాలు గాలి వెదజల్లినట్టు
వానలోన తేనె కూడా కలిపి కురిసినట్టు
మంచు బదులు చక్కెరంత చిలకరించినట్టు
ఆకాశమే పూల దారాల దుప్పటై పరుచుకున్నట్టు
నిను తలచినప్పుడే తోచాయి నాకు ఇలా కలలు కన్నట్టు

kit-kat
ఏ పారిజతములు ఇయ్యగలనే సఖీ
నీ పాద దాసుడను అవ్వగలను కాని
ఏ కానుకివ్వగలను చెలీ
నీ కనులకు కాటుక అవ్వగలను కానీ

kit-kat
ఓ ప్రియా నా గుండెల్లో రగిలే జ్వాలాగ్నితో నువ్వు చలి కాచుకున్నావు
నా మనస్సులో బద్దలయ్యే విస్ఫోటనంలో నువ్వు పాటలు పాడుకున్నావు
నా కన్నీటి సముద్రపు ఒడ్డున పసిపాపల్లె అడుకున్నావు
ఓ చెలీ నీ సంతోషాన్ని కాదనలేక నేనేది ఆపడానికి ప్రయత్నించలేదు
నీ ఆనందాన్ని పెంచే ప్రయత్నంలో ఏ చోటనీ విరమించలేదు..

kit-kat
ఏమడిగావు నన్ను ఓ ప్రియా?
నిను విడువమనే కదా
నిను విడుస్తాను కానీ నా ప్రేమను కాదు !!

kit-kat
నీ కనుల వెంట జాలువారే కన్నీటినై ఉండనా
లేక జీవితాంతం నీ వెన్నంటి నే ఉండనా
నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే ప్రియా
ప్రేమా లేక ప్రాణ త్యాగమా?

kit-kat
చంద్రుని అడిగాను నా చెలి ఏదని?
ఇదిగో నా వెన్నెలే అన్నాడు
సూర్యుని అడిగాను నా సఖి ఏదని?
ఇదిగో నా కిరణాలే అన్నాడు
తారల్ని అడిగాను నా ప్రియురాలు ఏదని?
ఇదిగో మా మెరుపులే అన్నాయి
అద్దాన్ని అడిగాను నా జవరాలు ఏదని?
ఇదిగో నీవేగా నేన్నది !!

kit-kat
వలచిన చేలియే అలిగిన యెడల
పిలిచిన సఖియే నను తలవక ఎటుల?
ఏమందురో అసలు ఏమందురో
ప్రియురాలి వలపు సముద్రంలో దూకనా?
జవరాలి తలపుల మేడెక్కి దూకనా?
లేక గడసరి చూపుల తాడును నా మెడకి బిగించనా?

kit-kat
ఎవరైనా జాబిలిలో జ్వాలలు చూశారా
వెన్నెలలో చీకటి చూశారా
ఏటికి స్తబ్ధత చూశారా
నా చెలి లేని నా గుండెని చూడండి చాలు అన్నీ కనిపిస్తాయి

kit-kat
వజ్రమును మబ్బులో ముంచాక
ఆ పైన తెలిమంచు తో కడిగాక
వెండి బాణాలను చూపుల్లా మలిచాక
తేనె దారాలను కురులుగా చేర్చాక
సుమహారపు సుగంధాలను అద్దాక
ఆకసాన్ని చీరల్లె చుట్టాక
తారలనే హారాల్లా కూర్చాక
ఎమౌతుందోనని వేచి చూసాడు ఆ బ్రహ్మ !
సందేహము లేదు అది క్కచ్చితంగా నువ్వేనమ్మ !!

kit-kat
సముద్రాన ఉప్పునై నే నిన్ను చేరాను
నీవు ఆవిరై చేరావు మేఘానికి
చిరుగాలినై తాకాను ఆ కరుమబ్బుని
నీవు చినుకువై రాలావు లే ధరణికి
మొక్కనై ఎదురు చూశాను నీ రాకకై
పిడుగువై పడ్డావు నను దహించడానికి !
చివరకి పువ్వునై చేరాను నీ పాదాలని !!

kit-kat
నా గుండె నేల మీద నీ మాటలు చిరు జల్లులు
నా కంటి వెలుగు లోన నీ చూపు రేఖలు
నా మనసు నది లోన నీ హొయలు పరవళ్ళు
నా కవిత ముగ్గులోన నీ నవ్వు రంగులు
నీ మాట కోసం ఎదురుచూస్తనే జన్మజన్మలు
నా మదిలో నువు దించకే సుతి మెత్తని కత్తులు

kit-kat